భోరుమన్న కృష్ణంరాజు
హైదరాబాద్‌ః బాలయోగి మరణం వార్తవిని హైదరాబాద్ లో వున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు గుండెలు పగిలేలా రోదించారు. బాలయోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రముఖులు బంజారా హిల్స్ లోని ఆయన నివాసానికి తరలి వచ్చారు.అసెంబ్లీ స్పీకర్ ప్రతిభాభారతి బాలయోగి కుటుంబ సభ్యుల బాధను చూసి కంటతడిపెట్టుకున్నారు. లోక్ సభలో తెలుగుదేశం నాయకుడు ఎర్రం నాయుడు భోరునవిలపించారు.
10 నుంచి 18 ఏళ్లలోపు వున్న నలుగురు బాలయోగి పిల్లలు, ఆయన సతీమణి దుఃఖాన్ని ఆపడం ఎవరికీ చేకకాకుండా పోయింది.












Click it and Unblock the Notifications
