న్యూఢిల్లీః లోక్ సభ స్పీకర్ బాలయోగి మృతికి సంతాప సూచనగా ఆది సోమవారాలను కేంద్ర ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించింది.
బాలయోగి మరణవార్తవిన్న కేంద్ర క్యాబినెట్ ఆదివారం మధ్యాహ్నం సమావేశమైంది. బాలయోగి మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆది సోమవారాలు రెండు రోజుల సంతాపం పాటించాలని, ఎటువంటి అధికార కార్యకలాపాలు నిర్వహించరాదని నిర్ణయించింది.