అయోధ్యః కరసేవకులు ప్రవేశించకుండా అయోధ్యను సాయుధ దళాలతో ఉత్తరప్రదేశ్‌ప్రభుత్వం దిగ్బంధం చేసింది. ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టిన కరసేవకులను ఖాళీ చేయించే కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతున్నది.
అయోధ్యలో కరసేవకులుపెద్దఎత్తున చేరితే పరిస్థితి మరోసారి అదుపుతప్పే అవకాశం వున్నదని ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం భయపడుతున్నది.పెద్దసంఖ్యలో కరసేవలకులు అయోధ్యలో చేరితే దీనిని టెర్రరిస్టులు ఒక అవకాశంగా తీసుకుని భారీ ఎత్తున విధ్వంసం సృష్టించే అవకాశం వున్నట్టుగా తమకు సమాచారంఅందిందని అధికారులు తెలిపారు.