అమలాపురం చేరిన బాలయోగి భౌతికకాయం
అమలాపురంః హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలైన లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం కొత్తఢిల్లీ నుంచి అమలాపురం చేర్చారు. సోమవారం వేకువజామున హైదరాబాద్ నుంచి కొత్తఢిల్లీ తరలించి బాలయోగి భౌతిక కాయాన్ని పార్లమెంటు భవనప్రాంగణంలో వుంచారు. ప్రధాని, రాష్ట్రపతి, వందలాది మంది ఎం.పి.లు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులుఅర్పించారు. సాయంత్రం బాలయోగి భౌతిక కాయాన్ని ప్రత్యేకవిమానంలో రాజమండ్రి తరలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో దివంగత నేతను అమలాపురం తరలించారు.












Click it and Unblock the Notifications
