అగ్ర నేతల అశ్రుతర్పణం

న్యూఢిల్లీః రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌, ప్రధాని వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, మాజీ ప్రధానులు చంద్రశేఖర్‌, పివి నరసింహారావు, విపి సింగ్‌, ఐకె గుజ్రాల్‌తో సహా పలువురు అగ్రశ్రేణి నేతలు, మంత్రులు, ఎంపీలు సోమవారం నాడు పార్లమెంట్‌ హౌస్‌లో దివంగత నేత, లోక్‌సభ స్పీకర్‌ జిఎంసి బాలయోగి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

మాజీ రాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌, లోక్‌సభ మాజీస్పీకర్లు శివరాజ్‌ పాటిల్‌, బలరామ్‌ జక్కర్‌, కేంద్ర మంత్రులు ప్రమోద్‌ మహాజన్‌, సుష్మాస్వరాజ్‌,అరుణ్‌శౌరి, మురసోలి మారన్‌, జగ్‌మోహన్‌, శరద్‌ యాదవ్‌, నితిష్‌ కుమార్‌, ఉమా భారతి, రామ్‌ నాయక్‌, వెంకయ్యనాయుడు పార్లమెంట్‌ హౌస్‌ వద్ద బాలయోగి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛాలు వుంచి శ్రద్దాంజలి ఘటించారు.విపక్ష నేతలు సోమనాథ్‌ చటర్జీ, ఎబి బర్దన్‌, డి రాజా, రాజ్యసభ సభ్యుడు షబ్మా ఆజ్మీ, ప్రముఖ న్యాయవాది ఎల్‌ ఎమ్‌సంఘ్వీ కూడా బాలయోగి పార్థివ శరీరాన్ని దర్శించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు పార్లమెంట్‌హౌస్‌ వద్ద వున్న తర్వాత బాలయోగి భౌతిక కాయాన్నిఅక్బర్‌రోడ్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. బుధవారం నాడు జరుగనున్న అంత్యక్రియల కోసం సోమవారం సాయంత్రం కోనసీమలోని ఆయనస్వస్థలానికి భౌతిక కాయాన్ని తరలిస్తారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+