సిద్దార్ధరెడ్డినిఅరెస్టుకు రంగం సిద్ధం!
హైదరాబాద్‌ః ఆస్పత్రిలో ఇన్నాళ్ళు కోమాలో వున్న సిద్ధార్ధ ఆదివారం స్పృహలోకి వచ్చాడని, అతని వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని తెలిసింది. వాంగ్మూలంలో సిద్దార్థ ఏం చేప్పాడనేవిషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆత్మహత్యకు ప్రోత్సహించిన నేరంపై సిద్దార్థనుఅరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలువినిపిస్తున్నాయి. అన్నివర్గాల దృష్టి ప్రత్యూషకేసుపై వుండడంతో సిద్దార్ధరెడ్డిని అరెస్టుచేయకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆలోచనతో పోలీసులు ఆ దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
చదువు పూర్తయ్యాక పెళ్ళి విషయం ఆలోచిద్దామంటూ సిద్ధార్థకు నచ్చచెప్పి పంపామని, మరుసటి రోజు ఉదయం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య తమ కుమారుడు వున్నట్లు సమాచారం వచ్చిందని రామేశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రత్యూషను మరచిపోతానని మాకు హామీ ఇచ్చిన సిద్దార్ధ తెల్లారే సరికివిషం తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సిద్దార్ధరెడ్డి మేనమామ మధుసూధన రెడ్డి ప్రశ్నించారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రత్యూష తల్లే వారిద్దరినీవిషం తాగేందుకు ప్రోత్సహించిందని ఆయన ప్రత్యారోపణ చేశారు.












Click it and Unblock the Notifications
