ఎదుర్లంక బ్రిడ్జికి బాలయోగిపేరు

అమలాపురంః యానాం-ఎదుర్లంక బ్రిడ్జికి దివంగత లోక్‌ సభ్‌ స్పీకర్‌ బాలయోగి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ లో నిర్మిస్తున్న స్పోర్ట్స్‌ విలేజ్‌ కు కూడా బాలయోగి పేరు పెడతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఎదుర్లంకలో గానీ, అమలాపురంలో గానీ బాలయోగి పేరిట ఓ మెమోరియల్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

యానాం-ఎదుర్లంక బ్రిడ్జి ఆ ప్రాంత ప్రజలకు బాలయోగి ఇచ్చిన వరం. ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల పరిసరాల్లోని 12 గ్రామాల ప్రజలు పట్టణానికి సులువుగా రాకపోకలు సాగించే అవకాశం వుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని వాజ్‌పేయిని ఆహ్వానించాలని బాలయోగి అనుకొనే వారు. విధి వక్రించడంతో ప్రధాని వాజ్‌పేయి బాలయోగి అంత్యక్రియలకు అమలాపురం రావాల్సి వచ్చింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+