వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ దౌత్యసిబ్బందిపై భారత్ వేటు
న్యూఢిల్లీః భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని అక్రమంగాస్వదేశానికి చేరవేస్తున్న ఇద్దరు పాక్ రాయబార కార్యాలయం సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. దౌత్య నిబంధనలకువిరుద్ధంగా వ్యవహరిస్తున్న మహమ్మద్ గుల్జారిన్, సుల్తాన్ మహమ్మద్ లను వెనక్కు పిలిపించుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం పాక్ ను కోరింది. భారత విదేశాంగశాఖ ప్రతినిధి నిరుపమారావు మంగళవారం ఈవిషయాన్ని వెల్లడించారు. వీరిద్దరినీ బహిష్కరించినవిషయాన్ని పాక్ రాయబార కార్యాలయానికి చెప్పామని,వీరిద్దరూ ఓ వారంలోగా దేశం విడిచివెళతారని అమె తెలిపారు. పాకిస్తానీ దౌత్యవేత్త అతని డ్రైవర్ రహస్యపత్రాలు సేకరిస్తుండగా పట్టుపడ్డారని భారత్ శనివారం ప్రకటించినవిషయం విదితమే.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]