గాంధీనగర్‌ః
గుజరాత్‌లో
ఇటీవల
జరిగిన
మతపరమైన
మారణహోమానికి
బలైన
బాధితులకు
ప్రభుత్వం
చెల్లించే
పరిహారంలోవివక్షపై
పెద్దఎత్తున
దుమారం
చెలరేగుతున్నది.
గోధ్రా
దుర్ఘటనలో
మరణించిన
వారి
కుటుంబాలకు
ఒక్కొక్కరి
రెండు
లక్షల
రూపాయల
చొప్పున
దరిమిలా
చెలరేగిన
అల్లర్లలో
ప్రాణాలు
కోల్పోయిన
వారి
కుటంబాలకు
లక్ష
రూపాయల
చొప్పున
నష్టపరిహారంఅందించాలని
గుజరాత్
రాష్ట్ర
ప్రభుత్వం
నిర్ణయించింది.
ఈ
నిర్ణయం
పై
దేశవ్యాప్తంగా
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
అవుతున్నది.
ప్రజల
ప్రాణాలను
ప్రభుత్వం
వేరువేరుగా
చూడ్డాన్ని
మేధావులు,
ప్రజాస్వామిక
వాదులు
తీవ్రంగా
ఖండిస్తున్నారు.
గోధ్రా
మారణకాండ
బాధితులకుటుంబాలకు
రెండు
లక్షల
రూపాయల
చొప్పున
పరిహారం
ఇవ్వనున్నట్టుగా
సంఘటన
జరిగిన
వెంటనే
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి
ప్రకటించారు.
గోధ్రా
సంఘటనపైవిచారణ
కమిషన్‌ను
కూడా
నియమించిన
మోడి
ఆ
కమిషన్
పరిథిలోకి
తర్వాత
జరిగిన
మతకల్లోలాలు
రావని
కూడా
ప్రకటించారు.
ప్రభుత్వం
విధానాలను
తీవ్రంగా
తూర్పారబడుతూ,
మతకల్లోల
బాధితులందరికీ
సమానంగా
రెండు
లక్షల
రూపాయల
చొప్పున
పరిహారం
చెల్లించాలని
కాంగ్రెస్
పార్టీ
డిమాండ్
చేసింది.