వి.హెచ్.పి దారికొచ్చిందన్న జయేంద్ర
న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలోవిశ్వహిందూ పరిషత్, రామజన్మభూమి ట్రస్ట్ దారికొచ్చాయని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి మంగళవారం కొత్తఢిల్లీలో ప్రకటించారు.వివాదాస్పద స్థలం విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా వుండేందుకువిశ్వహిందూ పరిషత్ అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.
వివాదరహిత స్థలంలో శిలన్యాసానికి అనుమతిస్తేవివాదాస్పద స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టమంటూవిశ్వహిందూ పరిషత్ తనకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందన్నారు. మార్చి 15లోగా ఈ సమస్యకు ఒక పరిష్కారం సాధిస్తామని జయేంద్ర ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
