వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కంచి స్వామితో ప్రధాని చర్చలు
న్యూఢిల్లీః విహెచ్‌పి వైఖరి వల్ల సంక్లిష్టంగా మారుతున్న అయోధ్య సమస్యపై కంచి కామకోటి పీఠం శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితో ప్రధాని వాజ్‌పేయి సోమవారం రాత్రి మంతనాలు జరిపారు. ప్రధాని నివాసంలో జయేంద్ర సరస్వతి సుమారు గంటన్నరపాటు వున్నారు. చెన్నై నుంచి స్వామిజి సోమవారం నాడే ఢిల్లీ చేరుకున్నారు.
విశ్వహిందూ పరిషత్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటుకు ముందుగా తాము కూడా వెళ్లి కంచిస్వామిని కలిసారు. ప్రభుత్వంతో గొడవకు దిగకుండా సయోధ్య పూరితంగా ఆలయ నిర్మాణానికి సంబంధించినఅంశాలను ఖరారు చేయాలని జయేంద్ర సరస్వతి వారికి సూచించినట్టుగా తెలిసింది. మంగళవారం నాడు విహెచ్‌పి నేతలు మరోసారి జయేంద్రసరస్వతిని కలుసుకుని మాట్లాడే అవకాశం వుంది. ప్రధానితో తన చర్చలవివరాలను స్వామీజీ వారికి తెలియజేసే అవకాశం వుంది.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]