త్రిరువనంతపురంః
గత
నెలరోజులుగా
సమ్మె
చేస్తున్న
ప్రభుత్వ
ఉద్యోగులు,
ఉపాధ్యాయులకు
మద్దతుగా
వామపక్ష
ట్రేడ్
యూనియన్లు
ఇచ్చిన
పిలుపుమేరకు
మంగళవారం
నాడు
జరిగిన
కేరళ
రాష్ట్ర
వ్యాప్త
సమ్మెతో
జనజీవనం
పూర్తి
స్తంభించింది.
ప్రభుత్వం
ఎన్ని
ప్రయత్నాలు
చేసినప్పటికీ
వాహనాలు
ఎక్కడివక్కడే
నిలిచిపోయాయి.
దుకాణాలు,
హోటళ్లు
మూసివేశారు.
వందలాది
మందిని
పోలీసులుఅరెస్టు
చేశారు.
నీటి
సరఫరా,
విద్యుత్‌కు
మాత్రం
అంతరాయం
కలగలేదని
అధికారులు
చెప్పారు.
తమ
జీతభత్యాల్లో
కోతకు
నిరసనగా
ఫిబ్రవరీ
6
నుంచి
రాష్ట్ర
ప్రభుత్వ
ఉద్యోగులు
సమ్మె
చేస్తున్నవిషయం
విదితమే.