ప్రత్యూషకేసుపై చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు. ప్రత్యూష కేర్‌ ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితి మధ్య కన్నుమూసి పది రోజులు దాటింది. ఈ కేసులో ప్రముఖుల తనయుల ప్రమేయం వుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. సంచలనాత్మకమైన ఈ వ్యవహారం త్వరలో అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం వుంది. 314నిబంధన కింది స్పీకర్‌ ప్రత్యూష వ్యవహారాన్ని చర్చకు అనుమతించే అవకాశం వుంది. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాలను పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.

ప్రత్యూష కేసులో నిజానిజాల నిగ్గుతేల్చాల్సిందిగా తెలుగుసినీ వర్గాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ముఖ్యమంత్రినికోరారు. ప్రత్యూష తల్లికూడా తన కుమార్తెది సహజమరణం కాదని, తమకు న్యాయం చేయాల్సిందిగా చంద్రబాబునుకోరారు. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టి సారించి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఇప్పటివరకు కేసుపురోగతిని పోలీసుల అధికారులు ముఖ్యమంత్రికివివరించారు. నిజానిజాలు తేల్చేందుకు పరిశోధనను తీవ్రతరం చేయాల్సిందిగా చంద్రబాబు పోలీసులనుకోరారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+