వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మీయనేతకు అశృతర్పణం

By Staff
|
Google Oneindia TeluguNews

అమలాపురంః ఆత్మీయనేతను కడసారి చూసుకొనేందుకు తూర్పుగోదావరి జిల్లాలోన్ని పల్లెలన్నీ అమలాపురం కదిలాయి. దివంగత లోక సభస్పీకర్‌ బాలయోగి భౌతిక కాయాన్ని తొలుత ఆయనస్వస్థలమైన ఎదురులంకలోని రామాయంపేటకు తీసుకెళ్ళారు. అక్కడ ఆయన సమీపబంధువులు బాలయోగిని కడసారి దర్శించుకున్నారు. ఆ తరువాత బాలయోగి భౌతిక కాయాన్ని అమలాపురంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రజల సందర్శనార్థం వుంచారు. మంగళవారం ఉదయం నుంచి లక్షలాది మంది ప్రజలు బాలయోగిని సందర్శించిన నివాళులుఅర్పించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లానుంచే కాకుండా పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా బాలయోగి అభిమానులు అమలాపురం తరలివచ్చారు.

అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు
బాలయోగి అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని వాజ్‌పేయితో సహా ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోటిపల్లి - మల్లీశ్వరపురం రోడ్డు సమీపంలో ఐదు ఎకరాల స్థలంలో బాలయోగి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడే బాలయోగి మెమోరియల్‌ ను ఏర్పాటు చేస్తారు.

ఉభయగోదావరి జిల్లాలు బంద్‌
బాలయోగి మృతికి సంతాపంగా వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఉభయగోదావరి జిల్లాలలోస్వచ్ఛందంగా బంద్‌ జరిగింది. షాపుల యజమానులుస్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. బాలయోగి న్యాయవాదిగా పనిచేసిన కాకినాడ కోర్టులో బార్‌ అసోసియేషన్‌ తమపూర్వ సహచరునికి ఘనంగా నివాళులు అర్పించింది. రాజమండ్రి నగరపాలక సంస్థ కూడా మంగళవారం సమావేశమై బాలయోగికి కన్నీటి నివాళిఅర్పించింది. ఉభయగోదావరి జిల్లాలలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా మంగళవారం నాడు బాలయోగి సంతాప సభలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X