ప్రత్యూషకేసులో మాటతప్పిన బాబు!
హైదరాబాద్‌ః ప్రత్యూష కేసును సి.బి.ఐ.కి అప్పగించడంలో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తున్నదని సిపిఎం నేత నోముల నర్సింహయ్య ఆరోపించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సి.బి.సి.ఐ.డి. మీద నమ్మకం లేకనే ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిందిగా కోరామని, అందుకు సమ్మతించిన చంద్రబాబు ఇంతవరకు కేసును సిబిఐకి అప్పగించకపోవడంలో అర్థం ఏమిటని నోముల నర్సింహయ్య ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
