ఇక రోజూ అయోధ్యకేసువిచారణ
లక్నోః అయోధ్య కేసుకు వున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ కేసును ప్రత్యేక కమిషన్ ద్వారా రోజూవిచారించేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. అయోధ్యవివాదం నానాటికీ తీవ్రం అవుతున్న దరిమిలాకేసుపై రోజువారీ విచారణ చేపట్టి త్వరితగతిన తీర్పు చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకువిజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని కోర్టు బుధవారం పరిశీలించింది.
రోజువారీ విచారణ జరిపినప్పటికీ ఈ కేసు తేలేందుకు మరో రెండేళ్ళు పడుతుందనిఅంచనా. అయోధ్య కేసుపై రోజువారీ విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని సున్నీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు జిలానీ చెప్పారు. రోజూవిచారణ జరిపితేనే మరో ఏడాదిన్నర సాక్ష్యాల నమోదుకే పడుతుంది. మరో నాలుగునెలలు తుది తీర్పు వెలువరించేందుకు పడుతుందని జిలానీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
