భారత-పాక్‌ మధ్య అణుయుద్ధ ప్రమాదం

వాషింగ్టన్‌ః భారత పాకిస్తాన్‌ ల మధ్య యుద్ధం జరిగితే అది చివరకు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం వున్నదని సిఐఎ డైరెక్టర్‌ జార్జి టెనెట్‌ హెచ్చరించారు. భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య 1971 నుంచి యుద్ధ అవకాశాలు మెండుగా వున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 1971తరువాత ఏ క్షణంలోనైనా ఆ రెండు దేశాలు తలపడే ప్రమాదం వుందనిసెనేట్‌ ఆర్మ్‌ డ్‌ సర్వీసెస్‌ సంఘం సమక్షంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. పాక్‌స్వాధీనంలో వున్న కాశ్మీర్‌ పై భారత్‌ దాడికి దిగినా పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

భారత - పాక్‌ లు ఇప్పటికే అణుపరీక్షలు జరిపినఅంశాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షించని ఇంకా ఎన్నో అధునాత ఆయుధాలు ఆ రెండు దేశాల వద్ద వున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+