ప్రత్యూష కేసు: పత్రికలకు ఆదేశాలు
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు పత్రికా ప్రతినిధులను అదేశించింది. ప్రత్యూష కేసునువిచారిస్తున్న జస్టిస్ మోతిలాల్ నాయక్, జస్టిస్ రోహిణిలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
మెడికో లీగల్ కేసు అని తెలిసి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేర్ ఆస్పత్రిని ఆదేశించింది. ప్రత్యూషస్టేట్‌మెంట్ తీసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేశారనేవిషయాన్ని కూడా తెలియజేయాలని కోర్టు సూచించింది.
ప్రత్యూష విస్రా డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించి, పది రోజుల్లోగా నివేదికఅందజేయాలని కోర్టు సంబంధిత సంస్థను ఆదేశించింది. కేసువిచారణను కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications
