ఆల్మాటీ: ఉగ్రవాదాన్ని ఖండిస్తూ,విచ్ఛిన్న ఉద్యమాలను బలపరచకూడదంటూ ప్రతిపాదించిన ఆల్మాటీ యాక్టును 16 దేశాల ఆసియా శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. ఈ శిఖరాగ్ర సదస్సులో భారత్, పాకిస్థాన్‌లు కూడా పాలు పంచుకున్నాయి.
ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని ఖండించాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదని,బలపరచడం గానీ, అంగీకరించడం గానీ చేయకూడదని ఆల్మాటీ యాక్టు స్పష్టం చేసింది. 16 సభ్య దేశాల్లోఅఎn్గానిస్థాన్, అజర్‌బైజాన్, చైనా, ఈజిప్టు, ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, కజక్‌స్థాన్, కిర్గిస్థాన్, మంగోలియా, పాకిస్థాన్, పాలిస్తీనా అథారిటీ, రష్యా, తజికిస్థాన్, టర్కీ, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి. పది దేశాలు పరిశీలకులుగా వ్యవహరించాయి. ఇందులోవియత్నాం, జపాన్, అమెరికా ఉన్నాయి.