న్యూఢిల్లీ: ఛోటా రాజన్ ముఠాకు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులుఅరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి వెళ్లిపోయే ప్రయత్నంలో వుండగా అతడ్ని తూర్పు ఢిల్లీబస్ టెర్మినస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితుడు యూసుఫ్ సులేమాన్‌పై పలు హత్య కేసులున్నాయి. కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ముంబాయి, బెంగుళూర్ పోలీసులు సులేమాన్ కోసం గాలిస్తున్నారు. బొంబాయి బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన హనీఫ్ కారావాల హత్యలో సులేమాన్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. బెంగుళూర్ నివాసి రాజు సుబా హత్యలో కూడా అతను కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు.