చైనాను చూసైనా మారండి: బాబు
హైదరాబాద్: చైనాలో పర్యటన జరిపి అక్కడి మంచినిస్వీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.విశాఖపట్నంలో ప్రత్యేక ఆర్థిక జోన్ ఏర్పాటుపై చర్చ సందర్భంగా గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ మాటన్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యకు సిపిఐ (ఎం) సభ్యుడు నోముల నర్సింహయ్య ప్రతిస్పందిస్తూ- చైనా ఎటు వైపు నుంచి అభివృద్ధి ప్రారంభించి ఎటు వైపుగా వచ్చిందో తెలుసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల తిండి, తదితర కనీసావసరాలు తీర్చిందని, మనం ఆ దిశలో లేమని అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని- కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సిపిఐ(ఎం) సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాయని, ఆ దేశం వెళ్తారు గానీ అక్కడి మంచిని నేర్చుకోవడం లేదని అన్నారు. ప్రపంచమంతా మారినా మన కమ్యూనిస్టులు మారడం లేదని, అయితే వారు మారాల్సి వస్తుందని, తప్పకుండా మారుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
