నల్గొండలో కదంతొక్కిన కాంగ్రెస్
నల్గొండః కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిఅరెస్టుకు నిరసనగా బుధవారం నల్గొండ జిల్లా బంద్ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.బస్ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రధాన రహదారుల్లో కాంగ్రెస్ నాయకులు ధర్నాలు నిర్వహించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తమ నాయకుడు దామోదర్ రెడ్డిఅరెస్టుకు నిరసనగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మాహుతికి ప్రయత్నించాడు. అయితే సాటి కార్యకర్తలు అతనిని అడ్డుకున్నారు.
దామోదర్ రెడ్డి వంటి నేరచరిత్ర గలవారిని సమర్ధిస్తున్న వై.ఎస్, ఎమ్మెస్సార్ పై చర్య తీసుకోవలసిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారంవిలేకర్లతో మాట్లాడుతూ దామోదర్ రెడ్డి ఇంట్లో బాంబులుపేలినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని, నేరచరిత్రగల వారిని వెనకేసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై చర్య తీసుకోవలసిందిగా ఆయన సోనియా గాంధీనికోరారు.












Click it and Unblock the Notifications
