హైదరాబాద్:చెస్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించగలరని ప్రపంచచెస్ విజేత విశ్వనాథన్ ఆనంద్ అన్నారు. ఇక్కడ జరిగిన ప్రపంచచెస్ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగిచారు.
సౌకర్యాలు పెంపొందిస్తే దేశ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించగలరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వహించడానికి ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు.