ఆంధ్ర ప్రాజెక్టుకు పిఎం శ్రీకారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధానరైల్వే ప్రాజెక్టును ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం ప్రారంభించారు. 15 వేల కోట్ల రాష్ట్రీయరైల్ వికాస్ యోజన కింద ఆయన మూడు రాష్ట్రాలకు చెందిన ప్రధానరైల్వే ప్రాజెక్టులను శాటిలైట్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టుతో పాటు బీహార్, గుజరాత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల దేశంలోరైల్వే నెట్‌వర్క్ సత్వర అభివృద్ధి, విస్తరణ సాధ్యమవుతాయి.
నిర్దిష్ట కాలపరమితిలో వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టుల కింద బీహార్‌లో గంగానదిపై ముంగర్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం, ముంబాయి- చెన్నై మార్గంలో గుత్తి- పుల్లంపెట్ట 151 కిలోమీటర్లను డబ్లింగ్ పని, గుజరాత్‌లోని 305 కిలోమీటర్ల గాంధీధామ్- పలన్‌పూర్ రైలు మార్గం గేజ్ కన్వర్షన్ పనులు చేపడతారు. ఈ ప్రధాన రైలు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు ద్వారా నాలు నగరాలను కలుపనున్నట్లు ప్రధాని చెప్పారు.












Click it and Unblock the Notifications