నిర్మల్ లో 4గురి సజీవదహనం
ఆదిలాబాద్: కన్నతండ్రే కసాయిగా మారి కొడుకును పొట్టబెట్టనపెట్టుకున్నాడు. తన కుటుంబసభ్యుల నలుగురిని సజీవదహనం చేశాడు. ఆస్తి కోసం ముడిగొండ నరహరి అనే వ్యక్తి ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగింది. గురువారం తెల్లవారుఝామున ముడిగొండ నరహరి నిర్మల్ లోని తన కుమారుడు నటేష్ గృహనికి వెళ్ళాడు.
ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు. కుమారుడు నటేష్, ఆయన భార్య నిర్మల, ఇద్దరు మనవరాళ్ళు, మరో మనవరాలు మహేశ్వరి పడుకొని ఉన్న గదికి నరహరి నిప్పటించి పారిపోయాడు. నటేష్ మినహా మిగతా నలుగురు సజీవ దహనం అయ్యారు. నటేష సగం శరీరం కాలపోగా, అతన్ని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. నిర్మల్ పోలీసులు కేస్ బుక్ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications