మంచి రోజుల వస్తాయి: వైయస్
హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను గురువారంనాడు రంగారెడ్డి జిల్లా మన్నెగూడా నుంచి ప్రారంభించారు. ఆయన 60 రోజల పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఆయన బుధవారం రాత్రంతా మన్నెగూడాలోని గుడారంలో పడుకున్నారు. గురువారం ఉదయాన్నే లేచి ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆయన ప్రజలకు చెబుతున్నారు. ప్రజలు రాజశేఖర్ రెడ్డికి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారి నుంచి ఆయన పిటిషన్లను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల నిధులు పచ్చాచొక్కాల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications