Home
Posted on 03-11-03
హుస్టన్: అమెరికాలో విద్యనభ్యసిస్తోన్న విదేశీ విద్యార్థులలో భారతీయుల శాతమే అధికం. అమెరికా ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ ఆ దేశంలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటోన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల శాతం 13. చైనా విద్యార్థులను మనవాళ్లు అధిగమించారు.
చైనా విద్యార్థులను మనవాళ్లు అధిగమించారు. 2002-03 సంవత్సరంలో రికార్డుల స్థాయిలో
మొత్తం 74,203 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసానికై వచ్చారు. భారతీయ విద్యావ్యవస్థలో ఉన్న కాంపిటీటీవ్ నెస్ వల్లే అమెరికా విద్యకై భారతీయ విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీసా నిబంధనల కఠినతర పరిస్థితుల్లోనూ అమెరికాకు విద్యార్థుల రాక అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది.












Click it and Unblock the Notifications
