Kavya Maran Anirudh wedding:గ్రీసులో పెళ్లి -ఎవరెవరు హాజరు అవుతున్నారు..?

నవంబర్ నెల పెళ్లిళ్లకు అనువైన సీజన్ కావడంతో చాలా మంది వివాహ వేడుకలను ఈ నెలలోనే జరిపించేస్తున్నారు.కామన్ మ్యాన్ నుంచి కరోడ్‌పతి వరకు..వీఐపీల నుంచి వీవీఐపీల వరకు అందరూ ఈ నెలనే తమ పిల్లల వివాహాలను చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైయస్ జగన్ సోదరుడు వైయస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిని చెన్నై వేదికగా ఎంత గ్రాండ్‌గా చేశారో చూశాం. ఇక తాజాగా అదే చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సన్‌రైజర్స్ అధినేత్రి కావ్యామారన్ - ది మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ల వివాహంకు సర్వం సిద్ధమైంది. అయితే ఈ గ్రాండ్ సెలబ్రిటీ ఈవెంట్‌కు వేదికగా గ్రీస్ నిలిచింది. ఈ వెడ్డింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ - ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ల వివాహం కోసం సర్వం సిద్ధమైంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రీస్ నగరంలో జరగనుంది. నవంబర్ 10,11వ తేదీల్లో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన అతిరథమహారథులకు మారన్ కుటుంబం ఆహ్వాన పత్రికలను అందజేసి వివాహానికి ఆహ్వానించారు. అయితే ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు గ్రీస్‌కు బయలుదేరి వెళ్లారు. ఇందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌లు చెన్నై ఎయిర్పోర్ట్‌లో తళుక్కుమన్నారు.ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తన కుటుంబంతో గ్రాండ్ వెడ్డింగ్‌ను అటెండ్ అయ్యేందుకు గ్రీస్‌కు బయలుదేరారు.

kavya-maran-anirudh-wedding-stalin-and-rajinikanth-take-flight-to-greece-here-are-the-details

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ఇప్పటి వరకు వైయస్ అనిల్ రెడ్డి కూతురుకు సంబంధించిన వెడ్డింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారగా.. ప్రస్తుతం కావ్యామారన్ అనిరుధ్ ల మ్యారేజ్ ప్రిపరేషన్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వారి వివాహవేడుకకు హాజరయ్యేందుకు ఎయిర్పోర్ట్‌కు చేరుకున్న సెలబ్రిటీల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ మ్యారేజ్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. గ్రీస్‌లో నవంబర్ 10, 11వ తేదీల్లో జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్.. ఆ తర్వాత నవంబర్ 21వ తేదీన చెన్నై వేదికగా రిసెప్షన్ ఉండనుంది.

పాపం కావ్యా పాప.. పాక్ స్టార్ ప్లేయర్ తో కాంట్రాక్ట్: నెట్టింట భారీగా ట్రోల్స్
పాపం కావ్యా పాప.. పాక్ స్టార్ ప్లేయర్ తో కాంట్రాక్ట్: నెట్టింట భారీగా ట్రోల్స్

అప్పటి వరకు చాలా రహస్యంగా..

ఇక కావ్యా మారన్ - అనిరుధ్‌ల వివాహంకు సంబంధించిన కొన్ని నెలలుగా పెద్ద చర్చే నడిచింది. అయితే అదంతా పుకార్లే అని అప్పట్లో ఈ రెండు కుటుంబాలకు చెందిన సన్నిహితులు తెలిపారు. దీంతో ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ అప్పుడప్పుడు జరిగేది. అంతా సీక్రెట్‌గా జరుగుతోందనుకుంటున్న సమయంలో కావ్యామారన్ - అనిరుధ్‌ల వివాహంకు సంబంధించి తొలిసారి అధికారికంగా తెలిసింది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం బయటపెట్టడంతోనే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివాహానికి ఆహ్వానించేందుకు కావ్యామారన్ తండ్రి సన్ గ్రూప్ ఛైర్మెన్ కళానిథి మారన్ దంపతులు రేవంత్ ఇంటికి వచ్చి ఇన్విటేషన్ అందజేశారు. ఆ ఫోటోలను తెలంగాణ సీఎంఓ విడుదల చేయడంతో బయటి ప్రపంచానికి కావ్యామారన్ - అనిరుధ్‌ల వివాహం గురించి అధికారికంగా కన్ఫామ్ అయ్యింది.

ఇక చెన్నై వేదికగా జరగనున్న కావ్యా మారన్ - అనిరుధ్‌ల గ్రాండ్ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడారంగానికి చెందిన క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+