ఆండ్రియా ఒక్కటే కాదు.. అనిరుధ్ చాలామందితో డేటింగ్ చేశాడు!
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి రీసెంట్‌గా వచ్చిన 'జైలర్-2' సినిమాకు ఆయన అందించిన అద్భుతమైన మ్యూజిక్ అయితే, రెండోది ఆయన పెళ్లి వార్త! సినిమా సక్సెస్ ఫీవర్ నుంచి ఇంకా బయటపడకముందే, అనిరుధ్ పెళ్లి ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న సినీ వర్గాలను, అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
కావ్యమారన్ తో పెళ్లి
సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్‌ను అనిరుధ్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, వచ్చే నెలలో గ్రీస్‌లో అత్యంత అట్టహాసంగా పెళ్లి పీటలెక్కింది. ఇక నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కళానిధి మారన్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అక్షరాల రూ.26 వేల కోట్ల ఆస్తులకు ఏకైక వారసురాలైన కావ్య మారన్‌ను అనిరుధ్ పెళ్లాడుతుండటంతో.. నెటిజన్లు సరదాగా "బక్కోడు జాక్‌పాట్ కొట్టేశాడంటూ" కామెంట్లు పెడుతున్నారు.

ఆండ్రియాతో డేటింగ్ రూమర్స్
పెళ్లి వార్తలతో పాటు అనిరుధ్ గత లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్ గురించిన చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఆయన రిలేషన్ షిప్ హిస్టరీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు నటి ఆండ్రియా. అనిరుధ్ కెరీర్ ప్రారంభంలో వీరిద్దరి రిలేషన్ గురించి తెలియని సినిమా లవర్స్ ఉండరు. వీరిద్దరి మధ్య ఆరేళ్ల వయసు తేడా (ఆండ్రియా పెద్దది) ఉన్నప్పటికీ, దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. అయితే వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు లీక్ కావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇక ఆ తర్వాత పలువురు హీరోయిన్లతోనూ అనిరుధ్ పేరు ముడిపడింది. టాలీవుడ్ నటి ప్రియా ఆనంద్‌తోనూ ఆయన డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని ఇద్దరూ క్లారిటీ ఇచ్చి ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు.
శ్రుతిహాసన్, కీర్తి సురేశ్, జోనితాగాంధీ
అలాగే '3' సినిమా తర్వాత శృతిహాసన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇద్దరూ స్పందించకపోవడంతో అది రూమర్‌గానే మిగిలిపోయింది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తోనూ అనిరుధ్ డేటింగ్ రూమర్స్ రాగా, కీర్తి ఆ వార్తలను ఖండించి, అనిరుధ్ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని తెలిపింది. ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకుని ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే, సింగర్ జోనితా గాంధీతోనూ అనిరుధ్ రిలేషన్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. రీసెంట్‌గా అనిరుధ్ పెళ్లి వార్త బయటికి రాగానే, జోనితా గాంధీ సోషల్ మీడియాలో ఓ సాడ్ సాంగ్ స్టోరీని షేర్ చేయడం మళ్లీ కొత్త చర్చకు దారితీసింది. మొత్తానికి మ్యూజిక్‌తో కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు బిజినెస్ టైకూన్ కుటుంబంలోకి అడుగుపెడుతూ తన లైఫ్‌లో బిగ్గెస్ట్ టర్న్ తీసుకుంటున్నాడు.














Click it and Unblock the Notifications
