Home
Posted on 05-11-03
కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అభివృద్ధి శూన్యమేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం జరిగిన బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు.
వెలుగు సర్వేలో అవకతవకలకు ప్రభుత్వానిదే బాధ్యత సిఎల్‌పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెలుగు సర్వేలో అనేక అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉండడం వల్లనే రాష్ట్రంలో చంద్రబాబు తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, ఖమ్మం జిల్లా బస్సు యాత్ర కూడా ఖరారైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications