Home
Posted on 18-11-03
తెలంగాణకు హైకమాండ్ అనుకూలం
హైదరాబాద్: తమ పార్టీ అధిష్ఠాన వర్గం తెలంగాణకు అనుకూలంగా ఉన్నదని తెలంగాణ కాంగ్రెస్ ఫోరమ్(సిఎఫ్‌టి) నాయకులు జి. చిన్నారెడ్డి చెప్పారు. తెలంగాణపై న్యూఢిల్లీలో చర్చలు జరిపి తెలంగాణ నాయకులు హైదరాబాద్ తిరిగి వచ్చారు.
తెలంగాణకే కాకుండా రాయలసీమకు, కోస్తాలకు ప్రాంతీయ కమిటీలు వేస్తారని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీలతో ఎన్నికల పొత్తుకు తమ పార్టీ
అధిష్ఠానం అంగీకరించిందని ఆయన చెప్పారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నికల పొత్తుపెట్టుకోవడానికి మార్గం సుగమమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం- బిజెపి కూటమిని ఓడించేందుకు ఈ పొత్తులు అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
