అమరావతి రైల్వే లైన్లో భారీ మార్పులు - ప్రధాన స్టేషన్, టెర్మినల్ ఏరియా ఫిక్స్..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులు ప్రణాళికా బద్దంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో మౌళిక వసతుల కల్పన పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అమరావతిని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా రైలు.. రోడ్డు మార్గాల పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా రైల్వే లైన్ లో మార్పులు చేసారు. ప్రధాన స్టేషన్ తో పాటుగా టెర్మినల్ నిర్మాణం చేసే ప్రాంతాలను ఖరారయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి కేంద్రంగా రైల్వే లైన్ కనెక్టివిటీ.. టెర్మినల్.. ప్రధాన రైల్వే స్టేషన్ పైన రైల్వే శాఖ కీలక చర్చలు చేస్తోంది. తొలుత ఖరారైన ప్రతిపాదనల ప్రకారం ఎర్రుపాలెం - నంబూరు మార్గం పొడవు 56.53 కిలోమీటర్లు కాగా, తాజా మార్పులతో ఇది 58.1 కిలోమీటర్లకు చేరింది. ఈ కారిడార్‌లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. కృష్ణా నదిపై దాదాపు 4.5 కిలోమీటర్ల పొడవైన భారీ ఐకానిక్ వంతెనతో పాటుగా 32 మేజర్ బ్రిడ్జిలు, 92 మైనర్ వంతెనలు, 12 రోడ్ ఓవర్/అండర్ బ్రిడ్జిలకు ప్రణాళికలు సిద్దం చేసారు. అదే విధంగా ప్రధాన 'అమరావతి రైల్వే స్టేషన్' తాడికొండకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతానంలో డిసైడ్ చేసారు.

రైల్వే శాఖ తో కీలక చర్చలు
అదే విధంగా 24 ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు కలిగిన సుదీర్ఘ రైళ్లను నిలిపి సర్వీసింగ్ చేసేందుకు వీలుగా కొప్పురావూరు వద్ద 230 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు కానుంది. ఇందు లో 9 ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు, 6 సైడ్ లైన్లు, పిట్ లైన్లు, 12 స్టీరింగ్ లైన్లతో భారీ నిర్వహణ హబ్ సిద్ధం కానుంది. ఇందుకోసం భూమిని కేటాయించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఏపీ సీఆర్డీఏ ను కోరింది. కొత్త రైల్వే లైన్లో 'పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు' రైల్వేస్టేషన్లు రానున్నాయి. వీటిలో పెద్దా పురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు వద్ద క్రాసింగ్ స్టేషన్లకు నిర్ణయించారు. భవిష్యత్ లో ఎర్రబాలెం, నంబూరు స్టేషన్లు జంక్షన్లుగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications
