నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఎవరు? రేసులో ఐదుగురు స్టార్ హీరోలు!

హాలీవుడ్ స్టైల్ ఇంటర్నేషనల్ యాక్షన్-స్పేస్ డ్రామా సిరీస్ 'జేమ్స్ బాండ్ 007' పాత్రలో నటించబోయే తదుపరి నటుడు ఎవరనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. ఐకానికి 007 రోల్ కోసం సెర్చింగ్ చివరి దశకు చేరుకోగా.. ప్రముఖ బ్రిటీష్ నటులు రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హోల్ట్, జోష్ ఓ కానర్, జాక్ లోడెన్, కాలమ్ టర్నర్లు తుది స్క్రీన్ టెస్టింగుల రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్
'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్

బ్రిటీష్ నటులకే ప్రాధాన్యం ఎందుకు?
జేమ్స్ బాండ్ పాత్ర సంస్కృతి, చరిత్ర, దాని మూలాలు బ్రిటన్ స్టైల్‌తో ముడిపడి ఉంటాయి. ప్రముఖ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ 007 ఏజెంట్, బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రధాన ప్రతినిధిగా, శతాబ్ధాల నాటి రాజసం, కఠిన శైలి కలగలిపి ఐకానిక్ పాత్ర. ఈ పాత్ర గొప్పదనాన్ని కాపాడుకునేందుకు ఫ్రాంచైజ్ నిర్మాతలు బార్బరా బ్రోకోలీ, మైఖేల్ జి.విల్సన్‌లు జేమ్స్ బాండ్ పాత్రను కేవలం యూకే లేదా కామన్వెల్త్ దేశాలకు చెందిన నటులు మాత్రమే పోషించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు.

Next James Bond 007 5 British Actors Enter Final Auditions for Iconic Role Full Details Here

రేసులో ఉన్న ఐదుగురు స్టార్ నటుల వివరాలు

రాబర్ట్ ప్యాటిన్సన్"
'హ్యారీ పోటర్', 'ట్విలైట్' సిరీస్‌ల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లీష్ నటుడు ప్యాటిన్సన్. ది బ్యాట్ మ్యాన్, మిక్కీ 17 సినిమాలతో తన నటనతో ప్రపంచస్థాయి హీరోగా ఎదిగి ఇప్పుడు బాండ్ రేసులో నిలిచారు.

నికోలస్ హోల్ట్
'అబౌట్ ఎ బాయ్', 'స్కిన్స్' ప్రాజెక్టులతో గుర్తింపు పొందిన ఈ నటుడు 'ఎక్స్-మెన్' సిరీస్, 'మాడ్ మాక్స్:ఫ్యూరీ రోడ్', 'సూపర్‌మ్యాన్'సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ స్టార్ గా స్థిరపడ్డారు.

గంటకు 60 వేలకు పైగా టికెట్లు తెగుతున్నయ్.. 3 రోజుల్లో రూ. 400 కోట్లు..!
గంటకు 60 వేలకు పైగా టికెట్లు తెగుతున్నయ్.. 3 రోజుల్లో రూ. 400 కోట్లు..!

జోష్ ఓ కానర్:
ప్రసిద్ధ ఓటీటీ సిరీస్ 'ది క్రౌన్'లో ప్రిన్స్ చార్లెస్ పాత్రను పోషించి ఎమ్మీ అవార్డు గెలుచుకున్నారు. 'గాడ్స్ ఓన్ కంట్రీ', 'చాలెంజర్స్' వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

జాక్ లోడెన్:
ప్రసిద్ధ స్కాటిష్ నటుడు అయిన జాక్, క్రిస్టోఫర్ నోలన్ సినిమా 'డన్‌కిర్క్'లో తన అద్భుత నటనతో గుర్తింపు పొందారు. స్పై సిరీస్ 'స్లో హార్సెస్'లో రివర్ కార్ట్‌రైట్ పాత్రకు గానూ బాఫ్టా నామినేషన్ దక్కించుకున్న అనుభవం ఆయనను బాండ్ పోటీలో ముందంజలో ఉంచింది.

కాలమ్ టర్నర్:
'ఫ్యాంటాస్టిక్ బీస్ట్స్' సిరీస్, 'ది క్యాప్చర్' ద్వారా పాపులర్ అయిన ఈ బ్రిటిష్ నటుడు, 'మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్', 'ది బాయ్స్ ఇన్ ది బోట్' చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.

ఈ ఐదుగురిలో డానియల్ క్రెయిగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తదుపరి 'జేమ్స్ బాండ్ 007'గా స్క్రీన్‌పై మెరిసే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+