కొత్త పెన్షన్ల లబ్దిదారుల జాబితా ఖరారు, వీరికే పంపిణీ - ఇలా చెక్ చేసుకోండి..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల అర్హుల జాబితా ఖరారు చేసింది. వీరికి కొత్తగా పెన్షన్లు పంపిణీకి డిసైడ్ అయింది. వీరి జాబితాను ప్రకటించింది. లబ్దిదారులు ఈ జాబితాలో తమ పేరు చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్తగా చేయూత పథకం కింద ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వీరికి వచ్చే నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల పైన తీపి కబురు అందించింది. కొత్త పెన్షన్ల అందించాలని తాజా గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం కేటగిరీల వారీగా అర్హులను ప్రకటించింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావటంతో వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. మొత్తం 5.50 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించారు. దాదాపు 4.50 లక్షల మంది చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరీల కింద సామాజిక పింఛన్లు పొందేందుకు అర్హత సాధించినట్లు గుర్తించింది. వారికి ఈ నెల నుంచే పింఛన్లను పంపిణీకి సిద్దమైంది. అర్హులైనవారికి పింఛన్ల మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు వచ్చే నెల నుంచి పెన్షన్లు అందించాలని డిసైడ్ అయ్యారు. వితంతువుల కేటగిరీ కింద 3 లక్షల మంది, దివ్యాంగు లు లక్ష మంది, నేత గీత కార్మికులు 50 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

లబ్దిదారుల జాబితా సిద్దం.. పెన్షన్ల పంపిణీ
కాగా, పెన్షన్ కు అర్హత సాధించిన వారి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. లబ్ది దారులు తమ పేర్లు చెక్ చేసుకునేందుకు తెలంగాణ చేయూత పథకం వెబ్ సైట్ సందర్శించాలి. పెన్షన్ ఐడీ,UID/SADAREM ID నమోదు చేస్తూనే.. ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై మీ పింఛన్ స్టేటస్ కనిపిస్తుంది. నగదు జమ పైనా అక్కడే సమాచారం ఉంటుంది. కాగా.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని దాని స్టేటస్ కూడా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దసరా నుంచి పంపిణీ చేయాలని తొలుత భావించారు. అయితే, ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో.. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారులను ఖరారు చేసారు. వీరికి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది.













Click it and Unblock the Notifications
