Home

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 18-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

లెండిపాజెక్టుపై ఒప్పదం ఖరారు

హైదరాబాద్‌ః మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ ల ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టుఅయిన లెండిపై ఉభయ రాష్ట్రాల మధ్య మంగళవారంఉదయం ఒప్పందం కుదిరింది. గోదావరి నదిపై ఈ ప్రాజెక్టునిర్మాణం పూర్తయితే మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలకు, మనరాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాకు 2 టిఎంసిల సాగునీరుఅందుతుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే,మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలాంఛనప్రాయమైన చర్చ అనంతరం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యేవారికి పునరావసం కల్పిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈసందర్భంగా చెప్పారు. లెండి ప్రాజెక్టు నిర్మాణానికి 275.83 కోట్లరూపాయలు ఖర్చవుతాయని 1999-2000 సంవత్సరంలోఅంచనా వేశారు. ఇందులో 62 శాతం మహారాష్ట్ర, 38 శాతంఆంధ్రప్రదేశ్‌ భరిస్తాయి. ప్రాజెక్టు వ్యయంకింది 12.98 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు సుశీల్‌ కుమార్‌ షిండేకుఅందజేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి