సీమలో కాంగ్రెస్‌ యాత్ర జోరు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 23-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కడప: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు తిరిగి చేపట్టినప్రజాహిత యాత్ర కడప జిల్లాల్లో విశేషస్పందన లభించింది. ఆదివారం నాడు జిల్లాల్లోనిజమ్మలమడుగు తదితర పట్టణాల్లో పర్యటిస్తూ అనంతపురందిశగా సాగిన ఈ యాత్రకు ప్రజలు నుంచి మంచిస్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సభలవద్ద పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌మాట్లాడుతూ..అధికారంలోకి వస్తేతెలుగుదేశం వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి తెచ్చిననిధులన్నింటిపైనా సమీక్ష జరుపుతామన్నారు.

బ్యాంకు నుంచి భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్నిరుణాంధ్రప్రదేశ్‌ గా మార్చారని ఆయన విమర్శించారు.కాంగ్రెస్‌ నక్సలైట్లతో మిలాఖత్‌ అయిందని చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై డీఎస్‌ మండిపడ్డారు. అర్థాంతర ఎన్నికలకు ప్రజలకుసరైన సమాధానం చెప్పుకోలేక బాబు ఇలాంటివ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.రాయలసీమలో రెండు జిల్లాలకే యాత్రను చేపట్టడాన్నిఆయన సమర్ధించుకున్నారు. ఎన్నికలు మధ్యంతరంగావచ్చినందున యాత్రను కుదించాల్సి వచ్చిందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X