కాలేకి ఏ పాపం తెలీదు: ఎంసీఎ

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 23-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

ముంబై: భారత ఏజట్టులో స్థానం సంపాదించేందుకు సెలెక్టర్లకు లంచంఇవ్వబోయాడని ఆరోపణలను ఎదుర్కొంటోన్న అభిజిత్‌ కాలేకుమహారాష్ట్ర క్రికెట్‌ సంఘం మద్దతు తెలిపింది.కాలేతో పాటు సెలెక్టర్లు కిరణ్‌ మోరే, ప్రణబ్‌ రాయ్‌లు కూడానిజనిర్ధారణ (లై డిటెక్షన్‌) పరీక్షలకుహాజరుకావాలని ఆ సంఘం కోరింది.

కాలేపై ఆరోపణలు చేసినవారే వాటిని నిరూపించాల్సిన అవసరం ఉందని సంఘం అధ్యక్షుడుబాలాసాహెబ్‌ తోర్వా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికిచెందిన కాలేకి అన్యాయం జరగకూడదనేఉద్దేశంతోనే ఆయనకు మద్దతు పలుకుతున్నట్లుఆయన పేర్కొన్నారు. కాలే నిర్ధోషిగా తాను భావిస్తున్నట్లుఆయన తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి