ఇందిరాగాంధీ పెళ్ళి నెహ్రుకిష్టం లేదు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 23-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: ఫిరోజ్‌ గాంధీని తన కూతురుఇందిరా పెళ్ళి చేసుకోవడం మాజీ ప్రధానమంత్రిజవహర్‌ లాల్‌ నెహ్రూకు ససేమిరా ఇష్టంలేదట. ఇందిరాకు, ఫిరోజ్‌ కు అభిప్రాయల విషయంలోగానీ, ఆలోచనలవిషయంలో గానీ పొంతన లేదని నెహ్రూ భావించారట. అంతేకాకుండాఇందిరా జీవితం విషయంలో నెహ్రూకు వేరేప్లాన్స్‌ ఉండేవని తాజాగా విడుదలైన ఓ పుస్తకంబయటపెట్టింది.

సహానా దాస్‌ గుప్తా రచించిన ది స్టోరీఆఫ్‌ లీడర్‌ అనే పుస్తకంలో ఇందిరా పెళ్ళి విషయంలోనెహ్రూకున్న విభేదాలను పూసగుచ్చినట్లువివరించారు. ఇందులో ఉన్న విషయాలు కొత్తేవేమీకాదు గానీ, ఈ పుస్తకంలో ఆధారాలతో సహా బయటపెట్టడంవిశేషం. ఇందిరా ఆక్స్‌ ఫర్డ్‌ లో చదువునుమధ్యలోనే ఆపేసి ఫిరోజ్‌ ను పెళ్ళిచేసుకోవాలనినిర్ణయించుకున్నారు. ఈ విషయం విన్న నెహ్రూఎంతో షాక్‌ తిన్నారని అందులో రాశారు. అప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోన్నఆయన తన కూతురికి నచ్చచెపుతూ రాసిన లేఖలను ఈపుస్తకంలో ఉటంకించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి