రైతులకు ప్రత్యేక ప్యాకేజీ: కాంగ్రెస్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 24-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

అనంతపురం: తాము అధికారంలోకి వస్తే కరువు ప్రాంతాల్లోని రైతులకు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి అమలు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. ప్రజాహిత బస్సు యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ప్రజాహిత బస్సు యాత్ర సోమవారం తాడిపత్రి నుంచి బయలుదేరింది.

ప్రత్యేక సర్వేలు జరిపి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, జిల్లాలవారీగా ఈసర్వేలు నిర్వహించి సమస్యలను గుర్తిస్తామని వారు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలకుఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వారు హామీ ఇచ్చారు. కర్ణాటక తరహాలో కుటుంబానికి రెండు లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఈఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వారు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాల వల్లనే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భర స్థితి నెలకొన్నదని,అందువల్ల వారిని ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ విలేకరులతో చెప్పారు. ఇది వర్క్‌షాపులాంటిదని ఆయన చెప్పారు. పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఈ వర్క్‌షాపును ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. అన్ని స్థాయిల నాయకులు,సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి