గుజరాత్‌ అల్లర్లు: 15 మంది దోషులు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 24-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

అహ్మదాబాద్‌: గోద్రా సంఘటన అనంతర అల్లర్లలో భాగంగా నడియాడ్‌ శివారులోని గింజార్‌ గ్రామంలోని 14 మంది ముస్లింలపై జరిగిన ఊచకోత కేసులో 15 మందిని గుజరాత్‌లోని నడియాడ్‌ తాలుకాలోని కోర్టు దోషులుగా తేల్చింది. గింజార్‌ గ్రామంలో 14 మంది ముస్లింలను నిరుడు మార్చి మూడవ తేదీన హతమార్చారు.

మరో ఎనిమిది మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. గంజార్‌ ఊచకోత కేసులో పోలీసులు 64 మందినిఅరెస్టు చేశారు. ఇందులో ఒక వ్యక్తి జ్యుడిష్యల్‌ కస్టడీలో మరణించాడు. తీర్పు వెలువడినప్పుడు 12 మంది మాత్రమే జ్యుడిష్యల్‌ కస్టడీలో ఉన్నారు. వారికి మంగళవారం శిక్షను ఖరారు చేస్తారని డిఫెన్స్‌ అడ్వొకేట్‌ టి.ఆర్‌. వాజ్‌పేయి చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి