Home
Posted on 24-11-03
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులు విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రతిస్పందిస్తామని భారత్ ప్రకటించింది. సరిహద్దు వెంబడి చొరబాట్లను ఆపినప్పుడే అది సాధ్యమవుతుందని భారత్ అభిప్రాయపడింది.
సియాచిన్‌లో వాస్తవ గ్రౌండ్ పొజిషన్ లైన్ వెంబడి కూడా పాకిస్థాన్ కాల్పులవిరమణను ప్రతిపాదించింది. పాకిస్థాన్ ప్రధానిమీర్ జఫరుల్లాఖాన్ జమాలి చేసిన ప్రతిపాదనలకు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నవ్‌తేజ్ శర్నవిలేకరులతో చెప్పారు. ఈ ప్రతిపాదనల అమలుకు తక్షణ సాంకేతిక స్థాయి చర్చలను తాము ప్రదిపాదిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
