టాన్సీ కేసు: జయకు విముక్తి

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 24-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: టాన్సీ భూముల కుంభకోణం కేసు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకువిముక్తి లభించింది. జయలలితకు కేసు నుంచివిముక్తి ప్రసాదిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం సుప్రీంకోర్టు సమర్థించింది.

ప్రభుత్వానికి చెందిన టాన్సీ భూములను జయ పబ్లికేషన్స్‌కు విక్రయించడంలో జయలలిత పాత్ర ఉన్నదనే అనుమానాలు బలంగా ఉన్నప్పటికీ ఆమె నేరం చేసినట్లు రుజువు చేయడానికి చట్టపరమైన సాక్ష్యాధారాలు లేవని జస్టిస్‌ ఎస్‌. రాజేంద్రబాబు, జస్టిస్‌పి.వి.రెడ్డిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అభిప్రాయపడింది. రెండు టాన్సీ కేసుల్లో చెన్నై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ జనతా పారట్‌ఈ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి,ఆర్‌. సాయి భారతి దాఖలు చేసిన రెండు పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి