అప్పగింతకు సిద్ధమే, కానీ..: షిండే

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 24-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

ముంబాయి: నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. అయితే ఈ నిర్ణయం ముంబాయి హైకోర్టు వెలువరించాలని ఆయన సోమవారం అభిప్రాయపడ్డారు.

స్టాంపుల కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నదని,అందువల్ల అంతిమ నిర్ణయాన్ని ముంబాయి హైకోర్టు ప్రకటించాల్సి వుంటుందని ఆయనవిలేకరులతో అన్నారు. తమను కోరితే తమ వైఖరిని స్పష్టంగా ఈ నెల 27వ తేదీన కోర్టు ముందువివరిస్తామని ఆయన చెప్పారు. స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రం భావిస్తోంది. అయితే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలుఅందుకు సిద్ధంగా లేదు. దీంతో ఇదంతా వివాదంగా మారింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X