25న మైసూరా టిడిపిలో చేరిక
హైదరాబాద్: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపించడంతో రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం వివిధ వర్గాలకు వరాలు ప్రకటించింది. రైతులకు, యువతకు, కార్మికులకు, ఇతర వర్గాలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరిగింది.
ఆరు లక్షల మందికి వృద్ధాప్యపింఛన్లు, లక్ష మందికివికలాంగుల పింఛన్లు, లక్ష మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులకు ఏడున్నర శాతం కరవు భత్యం ఇవ్వాలని, పింఛనుదార్లకు డిఎపెంచాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. రైతుమిత్ర,సిఎంఇవైలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications