నక్సల్స్ సమస్యపై రాష్ట్రం భేష్: షిండే
న్యూఢిల్లీ: స్టాంపుల కుంభకోణంలో ముంబాయి మాజీ పోలీసు కమీషనర్ ఆర్.యస్. శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కఠినమైన షరతులతో జస్టిస్ యన్. సంతోష్ హెగ్డే, జస్టిస్ యస్.బి. సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శర్మకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
శర్మకు డిసెంబర్ మొదటి వారం వరకు ఈ బెయిలు మంజూరైంది. అంటే రెగ్యులర్ బెయిల్ కోసం శర్మ పెట్టుకున్న బెయిల్ విచారణకు వచ్చే వరకు ఈ బెయిలు మంజూరైంది. యాబై వేల రూపాయల పూచీకత్తుతో, అంతే మొత్తంతో కూడిన రెండు సూరిటీలతో శర్మకు కోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని, సాక్షులను ఎవరినీ కలుసుకోకూడదని, కోర్టు అనుమతి లేకుండా పూణే నుంచి బయటకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది.











Click it and Unblock the Notifications
