నెల్లూరు,ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్:తమిళనాడు తీరంలో బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం వల్ల దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో శనివారం ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో శుక్రవారంపదిహేడు, నెల్లూరులో పన్నెండు,తిరుపతిలో ఐదు సెంటీ మీటర్ల వర్షం నమోదయింది.
వచ్చే రెండు రోజుల్లోఉత్తర కోస్తా, తెలంగాణ జిల్లాల్లో వర్షాలుకురిసే అవకాశముందని హైదరాబాద్‌వాతావరణ కేంద్రం డైరెక్టర్ భద్రంచెప్పారు. శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌నగరంలో చలి బాగా పెరిగింది. వర్షంకురవకపోయినా చలి తీవ్రతతో నగరవాసులు గడగడ వణకవలసివచ్చింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయంనెల్లూరు, ప్రకాశం, చిత్తూరు,కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
