తస్లీముద్దీన్‌కునాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్
పాట్నా:కేంద్ర పౌర సరఫరా శాఖ సహాయమంత్రి తస్లీముద్దీన్ తాజాగా మరోవివాదంలో చిక్కుకున్నారు. ఒక ఫ్రాడ్ కేసులోబీహార్ కోర్టు తస్లీముద్దీన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీచేసింది.
మహీంద్రాఅండ్ మహీంద్రా కంపెనీ దాఖలు చేసినపిటిషన్‌లో పాట్నా ఫస్టు క్లాస్ జ్యుడిష్యల్‌మెజిస్ట్రేట్ సుధీర్ కుమార్ సిన్హా ఈ నెలఐదవ తేదీన తస్లీముద్దీన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.తస్లీముద్దీన్ వాహనం కొనుగోలు చేసి,కంపెనీ పేర మూడు లక్షల రూపాయలకుచెక్కు ఇచ్చారని, అయితే అది చెల్లలేదని, ఆరకంగా తస్లీముద్దీన్ ఫ్రాడ్ చేశారనిమహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీడీలర్ లాలీ సేన్ తన పిటిషన్‌లోతెలియజేశారు. ఐదేళ్ల క్రితంతస్లీముద్దీన్ ఆ వాహనాన్ని కొన్నారు.తస్లీముద్దీన్‌ను మంత్రి వర్గంనుంచి తొలగించాలని బిజెపి ప్రధానిమన్మోహన్ సింగ్‌ను కోరింది.











Click it and Unblock the Notifications
