పాలస్తీనాయోధుడు అరాఫత్ అస్తమయం
రామల్లా(వెస్ట్ బ్యాంక్): పాలస్తీనా పోరాటయోధుడు యస్సార్ అరాఫత్‌అస్తమించారు. పాలస్తీనా కోసం యాబైయేళ్ల పాటు అలుపెరగని పోరు సలిపినఅరాఫత్ భారత కాలమానం ప్రకారంగురువారం ఉదయం తొమ్మిది గంటలకుకన్నుమూశారు. ఆయనకు డెబ్బైఅయిదేళ్లు.నోబెల్‌శాంతి బహుమతి పొందిన అరాఫత్‌పాలస్తీనా జాతీయవాదానికి ప్రతీక.స్వతంత్ర పాలస్తీనా కోసం ఆయనకన్న కలలు సాకారం కాలేదు. పాలస్తీనాప్రజల దృష్టిలో ఆయన తమ ప్రాంతస్వతంత్రత కోసం అలుపెరగని పోరాటంచేసిన పోరాటశిల్పి. పాశ్చాత్య దేశాలదృష్టిలో పశ్చిమాసియాలో శాంతి భగ్నంచేస్తున్న వ్యక్తి.
పాలస్తీనాఅథారిటీ అధ్యక్షుడిగా అరాఫత్‌స్థానంలో పాలస్తీనా స్పీకర్‌బాధ్యతలు స్వీకరిస్తారని పాలస్తీనాక్యాబినెట్ మంత్రి ప్రకటించారు.అరాఫత్ భౌతిక కాయానికి రమల్లాలోఅంత్యక్రియలు జరుగుతాయి. వారం రోజులక్రితం అరాఫత్ ఫ్రాన్స్‌లోని ఒక ఆస్పత్రిలోచేరారు. ఆయన భౌతిక కాయాన్ని ఖననంచేస్తారు.











Click it and Unblock the Notifications
