బాంబు పేలుళ్ళ కేసులోఇన్నయ్య అరెస్టు
హైదరాబాద్: జంటనగరాల్లోవరుస బాంబు పేలుళ్ళ కేసులో తెలంగాణలిబరేషన్ ఫోర్స్ నాయకుడు, తెలంగాణఉద్యమకారుడు ఇన్నయ్య (ఇన్నారెడ్డి) నినగర పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుచంద్రశేఖరరావు పోకడలు నచ్చకసొంతంగా సమాంతరంగా తెలంగాణఉద్యమం నడుతున్న ఇన్నారెడ్డిఅరెస్టు రాజకీయ వర్గాలనుఆశ్చర్యపరిచింది.
విద్యార్ధి దశనుంచి వివిధప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినఇన్నయ్య బాంబు పేలుళ్ళ వంటిచర్యలకు దిగుతారా అని ఆయనఅనుచరులు ఆశ్చర్యపోతున్నారు.చంద్రశేఖరరావు కుట్ర పన్నిఇన్నయ్యను ఈ కేసులో ఇరికించారనితెలంగాణ లిబరేషన్ ఫోర్స్ నాయకులుఆరోపించారు. కాగా తెలంగాణ రాష్ట్రంసాధించుకోడానికి హింసా మార్గం మంచిదికాదని, ఇన్నయ్య వంటి వారి వల్లతెలంగాణ ఉద్యమానికి విఘాతంకలుగుతుందని టిఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది.నగరంలో ఇటీవల కళాంజలి వద్దమరికొన్ని చోట్ల బాంబు పేలుడు సంఘటనలుజరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications