ఆర్టీసి బస్సుఛార్జీలు పెంచం: సంతోష్ రెడ్డి
ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎపియస్‌ఆర్‌టిసి) బస్సు ఛార్జీలుపెంచే ఆలోచన లేదని రవాణా శాఖ మంత్రిఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. డీజిల్‌ధర పెరిగినప్పటికీ ప్రయాణికులపైభారం వేయకూడదనే ఆలోచనతోబస్సు ఛార్జీలను పెంచకూడదనిఆనుకుంటున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోతెలిపారు.
ఆర్‌టిసిపదకొండు వందల కోట్ల రూపాయలనష్టాల్లో ఉన్నదని, నాలుగు రోజుల్లో ఒకసమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసి పరిస్థితినిసమీక్షిస్తామని ఆయన చెప్పారు.సామర్థ్యం పెంచుకోవడం ద్వారానష్టాలను పూరించుకునే ఆలోచనచేస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల అక్రమాలకుఅడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు. ఒకనెంబర్‌పై రెండు ప్రైవేట్ బస్సులునడుస్తున్నట్లు తమ దృష్టికివచ్చిందని ఆయన చెప్పారు.హైదరాబాద్‌లో హెల్మెట్ల వాడకంపైసత్ఫలితాలు వస్తే ఇతర పట్టణాల్లో కూడాదాన్ని అమలు చేస్తామని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
